గురువారం 16 జూలై 2020
International - Jun 27, 2020 , 18:43:23

ఐఈడీ పేలుళ్లలో ఎన్‌ఐహెచ్‌ఆర్సీ ఉద్యోగుల మృతి

ఐఈడీ పేలుళ్లలో ఎన్‌ఐహెచ్‌ఆర్సీ ఉద్యోగుల మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన ఐఈడీ పేలుళ్లలో ఇద్దరు ఉద్యోగులు మరణించారు. కాబూల్‌ నగరానికి తూర్పున ఉన్న పుల్-ఎ-చార్కి ప్రాంతంలోని కాబూల్ పీడీ 12 లో శనివారం ఉదయం ఐఈడీ పేలుడు సంభవించింది.  ఇందులో ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర మానవ హక్కుల కమిషన్ (ఎఐహెచ్ఆర్సీ) లోని ఇద్దరు ఉద్యోగులు మృత్యువాతపడ్డారు.  బాధితుల్లో ఒకరు ఫాతిమా ఖలీల్ (24), ఏఐహెచ్‌ఆర్సీ డోనర్‌ లైసన్‌ అధికారి కాగా, మరొకరు జావిద్ ఫోలాడ్ సంస్థలో డ్రైవర్. ఈ ఇద్దరు ఉద్యోగులు తమ కార్యాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. 

ఇది మ్యాగ్నటిక్‌ బ్లాస్ట్‌ అని కాబూల్ పోలీసులు ధృవీకరించారు. కాగా, ఈ సంఘటనను ఆఫ్ఘనిస్తాన్‌లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ (యునామా) ఖండించింది. మానవ హక్కుల రక్షకులపై దాడులను ఉపేక్షించేది లేదు.ఈ ఘటనపై తక్షణ దర్యాప్తు అవసరం.’ అని ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ఏజెన్సీ ట్వీట్‌ చేసింది. logo