సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 12:06:35

కరోనా భయం.. కిటికీల నుంచి టెన్నిస్‌ ఆట.. వీడియో

కరోనా భయం.. కిటికీల నుంచి టెన్నిస్‌ ఆట.. వీడియో

చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జనాలు గుమిగూడొద్దని అధికారులు ఆదేశిస్తున్నారు. సినిమా హాల్స్‌, పబ్బులు, క్లబ్బులను మూసేస్తున్నారు. 

అయితే చైనా తర్వాత ఇటలీలోనే కరోనా మరణాలు అధికమవుతున్నాయి. ఇటలీలో 2,503 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల విధులు, రవాణాపై నిషేధం విధించారు. ప్రతి పౌరుడు ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. 

ఈ క్రమంలో ఇద్దరు యువకులు తమ అపార్ట్‌మెంట్‌లోని కిటికీల నుంచి టెన్నిస్‌ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు. సుమారు 24 సెకన్ల పాటు వారు టెన్నిస్‌ ఆడారు. ఆ తర్వాత బంతి కింద పడిపోయింది. ఈ యువకుల టెన్నిస్‌ ఆటను మిగతా అపార్ట్‌మెంట్‌ వాసులు ఆసక్తిగా తిలకించి తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


logo