సోమవారం 25 మే 2020
International - Mar 29, 2020 , 13:11:29

ఆక్వేరియంలో కుక్క‌పిల్లల సంద‌డి..వీడియో

ఆక్వేరియంలో కుక్క‌పిల్లల సంద‌డి..వీడియో

అట్లాంటా: క‌రోనా ప్ర‌భావ ప‌రిస్థితుల‌తో అట్లాంటాలోని ప్ర‌సిద్ది చెందిన ఆక్వేరియంలో సంద‌ర్శ‌కులు రాక‌పోక‌ల‌ను నిషేధించారు. అట్లాంటా హ్యూమ‌న్ సొసైటీకి చెందిన సిబ్బంది ఒక‌రు రెండు కుక్క పిల్ల‌ల‌ను ఆక్వేరియంలోకి వ‌దిలాడు. రెండు కుక్క‌పిల్ల‌లు ఓడీ, కార్మెల్ ఆక్వేరియంలో తిరుగుతూ..కొత్త స్నేహితుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతూ సంద‌డి చేశాయి.

ఓడీ, కార్మెల్ ఆక్వేరియం చుట్టూ ప‌రుగెడుతూ..గ్లాస్ పైన నీటిలో ఉన్న వివిధ ర‌కాల చేప‌లు చూస్తూ ఉండిపోయాయి. కుక్క‌పిల్ల‌ల వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టడంలో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో మ్యూజియాలు, ఆక్వేరియ‌మ్స్‌, జూల‌ను తాత్కాలికంగా మూసివేసిన విష‌యం తెలిసిందే. logo