గురువారం 28 మే 2020
International - May 02, 2020 , 14:05:44

మాస్కో జనాభాలో 2 శాతం మందికి కరోనా పాజిటివ్‌!

మాస్కో జనాభాలో 2 శాతం మందికి కరోనా పాజిటివ్‌!

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో 2,50,000 మంది కరోనా బారినపడ్డారని నగర మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ అన్నారు. ఇది మాస్కో మొత్తం జనాభాలో రెండు శాతానికంటే ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్టుల్లో ఇది తేలిందని ఆయన తన బ్లాగ్‌లో వెల్లడించారు. 

అయితే దేశంలో ఇప్పటివరకు 1,14,000 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రష్యా ప్రకటించింది. ఇందులో మాస్కోలో నమోదైన కేసుల సంఖ్య 57,300గా ఉన్నది. ఈ వైరస్‌ దేశంలో 1,169 మంది మరణించారు. 

అధికారిక లెక్కల ప్రకారం మాస్కో మొత్తం జనాభా 12.7 మిలియన్లు. కానీ వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నది.


logo