శనివారం 04 జూలై 2020
International - May 27, 2020 , 13:36:44

బైకుపై వచ్చి కాల్పులు..ఇద్దరు పోలీసులు మృతి

బైకుపై వచ్చి కాల్పులు..ఇద్దరు పోలీసులు మృతి

ఇస్లామాబాద్‌: ఇస్లామాబాద్‌లో జరిగిన దాడిలో ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామాబాద్‌ టర్నోల్‌ ఏరియాలోని చెక్‌పాయింట్‌ వద్ద ఈ దాడి జరిగింది. పోలీసులు సాజిద్‌ అహ్మద్‌, మోహసీన్‌ జాఫర్‌  చెక్‌పాయింట్‌ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా..ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి వారిపై కాల్పులు జరుపగా..తీవ్రగాయాలతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ కాల్పులకు తామే కారణమని నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ అహ్రర్‌ ప్రకటించింది. కాల్పులు ఘటనపై రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇస్లామాబాద్‌ ఐజీ అమీర్‌ జుల్‌ఫికర్‌ ఖాన్‌ తెలిపారు. టెహ్రీక్‌-ఐ-తాలిబన్‌ తీవ్రవాద సంస్థ నుంచి హిజ్బుల్‌ అహ్రర్ విడిపోయి..నిషేధించబడింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo