ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 08:52:21

45 ఏళ్ల త‌ర్వాత స‌ముద్రంలో దిగిన వ్యోమ‌గాములు..

45 ఏళ్ల త‌ర్వాత స‌ముద్రంలో దిగిన వ్యోమ‌గాములు..

హైద‌రాబాద్‌: నాసాకు చెందిన ఇద్ద‌రు వ్యోమగాములు.. గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో సుర‌క్షితంగా దిగారు.  క్రూడ్రాగ‌న్ ద్వారా వ్యోమ‌గాములు.. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుంచి భూమికి రిట‌ర్న్ అయ్యారు. తొలిసారి ప్రైవేటు సంస్థ స్పేస్ఎక్స్ ఆ క్రూడ్రాగ‌న్ క్యాప్సూల్‌ను నిర్మించింది. వ్యోమ‌గాములు రాబ‌ర్ట్ బెన్‌కెన్‌, డ‌గ్ల‌స్ హ‌ర్లేలు .. ప్యారాచూట్ల స‌హాయంతో ఫ్లోరిడా తీరంలోని గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దిగారు. 45 ఏళ్ల త‌ర్వాత అమెరికా వ్యోమ‌గాములు స‌ముద్రంలో దిగడం ఇదే తొలిసారి. 1975, జూలై 24వ తేదీన హ‌వాయి తీరంలో థామ‌స్ స్టాఫ‌ర్డ్‌, వాన్స్ బ్రాండ్‌, డోనాల్డ్ స్లేట‌న్ వ్యోమ‌గాములు స‌ముద్రంలో దిగారు. అపొలో-సొయోజ్ ప్రాజెక్టులో భాగంగా వాళ్లు ఆ యాత్ర చేప‌ట్టారు. స్పేస్ఎక్స్‌కు చెందిన రాకెట్ మే 30వ తేదీన ఎగిరింది. క్రూ డ్రాగ‌న్ క్యాప్సూల్‌కు ఎండీవ‌ర్ అని పేరు పెట్టారు.  45 ఏళ్ల త‌ర్వాత వ్యోమ‌గాములు నీటిలో దిగార‌ని, చాలా సంతోషంగా ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. 



logo