శనివారం 08 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 07:08:09

45 ఏండ్ల తర్వాత సముద్రంలో వ్యోమగాముల ల్యాండింగ్‌

45 ఏండ్ల తర్వాత సముద్రంలో వ్యోమగాముల ల్యాండింగ్‌

ఫ్లోరిడా: అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఆదివారం ఓ చారిత్రక ఘట్టాన్ని లిఖించబోతున్నారు. 45 ఏండ్ల తర్వాత మరోసారి అంతరిక్షంనుంచి నేరుగా సముద్రంలో ల్యాండవబోతున్నారు. రాబర్‌ట బెన్‌కెన్‌, డగ్లస్‌ హర్లే అనే నాసా వ్యోమగాములు గత మేలో స్పేస్‌ ఎక్స్‌ వాణిజ్య రాకెట్‌ ప్రయోగంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లారు. వాళ్లు ఆదివారం మళ్లీ భూమికి తిరిగి వస్తున్నారు. అయితే, వాళ్లు దిగాల్సిన ఫ్లోరిడా తీరంలో ఇసాయిస్‌ హరికేన్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో వారిని తీసుకొస్తున్న స్పేస్‌ క్యాప్సూల్‌ సముద్రంలో దిగనుంది. గతంలో అపోలో మిషన్‌లోభాగంగా 1975లో సముద్రంలో ల్యాండయ్యారు. 


logo