గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 13:16:55

20 ల‌క్ష‌ల కోవిడ్ మ‌ర‌ణాలు.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్‌

20 ల‌క్ష‌ల కోవిడ్ మ‌ర‌ణాలు.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. యూరోప్ దేశాల్లో కొత్త‌గా న‌మోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య  సంస్థ మ‌ళ్లీ వార్నింగ్ ఇచ్చింది. వైర‌స్ నియంత్ర‌ణ‌కు స‌రైన చ‌ర్య‌లు తీసుకోకుంటే.. కోవిడ్ మ‌ర‌ణాలు 20 ల‌క్ష‌ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 9,85,707 మంది వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించారు. మొత్తం 32.3 మిలియ‌న్ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అమెరికాలో అత్య‌ధికంగా 70 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి.  ప‌ది ల‌క్ష‌ల మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం పెద్ద సంఖ్యే అని, అయితే ఆ మ‌ర‌ణాల సంఖ్య పెర‌గ‌కుండా ఉండేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మైఖేల్ ర్యాన్ తెలిపారు. యూరోప్‌లోని స్పెయిన్‌, పోల్యాండ్‌, ఫ్రాన్స్ దేశాల్లో కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో అక్క‌డ మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించారు. బ్రిట‌న్‌లో కూడా అనేక ప్రాంతాల్లో ఆంక్ష‌ల‌ను కొన‌సాగిస్తున్నారు.  అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్దు అంటూ ర‌ష్యా ప్ర‌జ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. బ్రెజిల్‌లో సాంప్ర‌దాయ కార్నివ‌ల్ వేడుక‌ల‌ను వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది.


logo