శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Jan 27, 2020 , 13:12:33

బైక్‌పై అర్ధనగ్నంగా జలకాలాట.. 5,500 జరిమానా

బైక్‌పై అర్ధనగ్నంగా జలకాలాట.. 5,500 జరిమానా

ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తూ స్నానం చేసినందుకు గానూ.. వారిద్దరికి పోలీసులు రూ. 5,500 జరిమానా విధించారు. ఈ ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది. హ్యున్‌ థన్హ్‌ ఖాన్హ్‌(23) అనే యువకుడు బైక్‌ నడుపుతున్నాడు. అతని వెనుకాల మరో వ్యక్తి కూర్చుని ప్రయాణిస్తున్నాడు. అయితే వీరిద్దరూ అర్ధనగ్నంగా బైక్‌పై కూర్చొని మధ్యలో బకెట్‌ పెట్టుకున్నారు. ఇక డ్రైవ్‌ చేసే వ్యక్తి ముందు బీర్ల కాటన్‌ పెట్టుకున్నారు. ఇక డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తిపై వెనుకాల ఉన్న వ్యక్తి నీళ్లు పోస్తూ ఎంజాయ్‌ చేశాడు. తలకు సబ్బు కూడా పెట్టుకుని స్నానం చేశారు వారిద్దరూ. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. ఆ బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వీరిద్దరికి పోలీసులు రూ. 5,500 జరిమానా విధించారు. ఈ వాహనదారుల వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని పోలీసులు తేల్చారు. హెల్మెట్‌ కూడా ధరించలేదు. 


logo