శనివారం 04 జూలై 2020
International - Jun 15, 2020 , 11:25:59

పాక్‌లో ఇద్దరు భారత దౌత్య అధికారులు మిస్సింగ్‌

పాక్‌లో ఇద్దరు భారత దౌత్య అధికారులు మిస్సింగ్‌

ఇస్లామాబాద్‌: భారత్‌కు చెందిన ఇద్దరు దౌత్య అధికారులు పాకిస్థాన్‌లో కనిపించకుండా పోయారు. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో వీరు పని చేస్తున్నారు. వీరిద్దరి మిస్సింగ్‌ గురించి పాకిస్థాన్‌ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. కాగా ఇటీవల ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయానికి చెందిన సిబ్బంది గూఢచర్యానికి పాల్పడటంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి ప్రతీకారంగా పాక్‌లోని భారత రాయబార కార్యాలయం సిబ్బందిపై ఆ దేశ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల కారులో వెళ్తున్న భారత దౌత్య అధికారిని ఆ దేశ నిఘా వ్యవస్థ ఐఎస్‌ఐకి చెందిన ఒకరు బైక్‌లో వెంబడించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ చర్యను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులు అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
logo