గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 17:06:13

కిచెన్ పైక‌ప్పు మీద‌ కొండ‌చిలువ‌ల రొమాన్స్‌.. ఫోటోస్ వైర‌ల్‌!

కిచెన్ పైక‌ప్పు మీద‌ కొండ‌చిలువ‌ల రొమాన్స్‌.. ఫోటోస్ వైర‌ల్‌!

45 కిలోల బ‌రువున్న రెండు భారీ కొండ‌చిలువ‌ల‌కు వంట‌గ‌దే దొరికింది. పాపం ఆ ఇంటి య‌జ‌మానికి న‌ష్టానికి గుర‌య్యాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా?  వీటి బ‌రువ‌కు కిచెన్ పైక‌ప్పు కాస్త కూలింది. దీంతో య‌జ‌మాని నివ్వెర‌పోయాడు. ఈ సంఘ‌ట‌న క్వీన్స్‌లాండ్‌లో చోటు చేసుకున్న‌ది. అక్క‌డ నివ‌సించే డేవిడ్ టైట్ ఇంటి పైక‌ప్పు ఊడి కింద ప‌డ‌డంతో వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్ స్టీవెన్‌కు పిర్యాదు చేశారు. వాళ్లు వ‌చ్చి ఆ రెండు కొండ‌చిలువ‌ల‌ను ప‌ట్టుకొని బంధించారు.

స్నేక్ క్యాచ‌ర్ వివ‌రాల ప్ర‌కారం ఒక పైథాన్ 2.9 మీ పొడ‌వుంటే రెండోది 2.5 మీట‌ర్ల పొడ‌వుంద‌ని చెప్పుకొచ్చారు. వీటికి సంబంధించిన ఫోటోల‌ను బ్రౌన్ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఒక‌పాము త‌లుపు ప‌క్క‌న ఉంటే రెండో పాము బెడ్‌రూంలో ఉంది. ఇది సంతానోత్ప‌త్తి కాలం కావ‌డంతో మ‌గ పైథాన్‌లు ఆడ పైథాన్‌ల‌పై పోరాడుతున్నాయ‌ని బ్రౌన్ అంటున్నారు. ఈ రెండు పైథాన్‌ల‌ను ప‌ట్టుకొని 1 కి.మీ. దూరంలో ఉన్న అడ‌విలో వ‌దిలిపెట్టారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జంతువులకు ఆస్ట్రేలియా నిలయం అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 

తాజావార్తలు


logo