ఆదివారం 01 నవంబర్ 2020
International - Sep 20, 2020 , 03:34:43

అమెరికాలో ఓ వేడుకలో కాల్పులు ఇద్దరు మృతి

అమెరికాలో ఓ వేడుకలో కాల్పులు ఇద్దరు మృతి

రోచెస్టర్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో శనివారం ఓ ఇంటివద్ద జరిగిన పార్టీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 14 మంది గాయపడినట్లు తాత్కాలిక పోలీస్‌ చీఫ్‌ మార్క్‌ సిమన్స్‌ మీడియాకు వెల్లడించారు. గాయపడినవారిని వివిధ దవాఖానలకు తరలించామని, వారికి ప్రాణాపాయమేమీలేదన్నారు.