శనివారం 30 మే 2020
International - May 16, 2020 , 10:32:28

న‌వాజ్ ష‌రీఫ్‌పై మ‌రో రెండు అవినీతి కేసులు

న‌వాజ్ ష‌రీఫ్‌పై మ‌రో రెండు అవినీతి కేసులు


హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన అవినీతి నిరోధ‌క శాఖ ఆ దేశ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌పై మ‌రో రెండు అవినీతి కేసుల‌ను న‌మోదు చేసింది. నేష‌న‌ల్ అకౌంట‌బులిటీ బ్యూరో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ షాజాద్ స‌లీమ్  ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగిన కేసులో న‌వాజ్‌తో పాటు ఆయ‌న సోద‌రుడు షాబాజ్ ష‌రీఫ్‌, కూతురు మ‌రియ‌మ్ న‌వాజ్‌, మ‌రో 13 మందిపై  విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.  న‌వాజ్ ఫ్యామిలీపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు కూడా న‌మోదు అయ్యింది. లాహోర్‌లోని అకౌంట‌బులిటీ కోర్టులో ష‌రీఫ్ ఫ్యామిలీపై రెండు కొత్త కేసుల‌ను న‌మోదు చేస్తామ‌ని ఎన్ఏబీ పేర్కొన్న‌ది.  ష‌రీఫ్ ఫ్యామిలీ అక్ర‌మంగా సుమారు రూ.700 కోట్లు ఆర్జించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. logo