గురువారం 21 జనవరి 2021
International - Jan 08, 2021 , 15:47:35

వైర‌స్ వ్యాప్తి.. రెండు న‌గ‌రాలు దిగ్భంధం

వైర‌స్ వ్యాప్తి.. రెండు న‌గ‌రాలు దిగ్భంధం

బీజింగ్‌: చైనాలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు ప్ర‌బ‌లుతున్నాయి.  దీంతో రాజ‌ధాని బీజింగ్‌కు దక్షిణ దిశ‌గా ఉన్న రెండు న‌గ‌రాల్లో తీవ్ర‌మైన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.  హుబేయ్ ప్రావిన్సులోని షిజియాహువాంగ్‌తో పాటు  జింగ్టాయి న‌గ‌రాల‌ను సంపూర్ణంగా దిగ్బంధించారు. ఈ రెండు న‌గ‌రాల‌కు చెందిన ప్ర‌జ‌లపై ట్రావెల్ ఆంక్ష‌లు విధించారు.  అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప న‌గ‌రం దాట వ‌ద్దు అని ఆదేశాలు జారీ చేశారు.  ప్ర‌జ‌లు, వాహ‌నాల క‌దిల‌క‌ల‌పై క‌ఠిన‌మైన నిఘా పెట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. దాదాపు లాక్‌డౌన్ త‌ర‌హాలో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. హుబేయ్ ప్రావిన్సుకు చెందిన ప్ర‌జ‌లు ఎవ‌రూ బీజింగ్‌లోకి ప్ర‌వేశించ‌కుండా ఉండేందుకు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. 72 గంట‌ల లోపు తీసుకున్న క‌రోనా నెగ‌టివ్ స‌ర్టిఫికేట్ ఉంటేనే ఇత‌రుల‌ను బీజింగ్‌లోకి వెళ్ల‌నిస్తున్నారు.   


logo