మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 14:47:12

అన్నదమ్ముల ప్రేమ.. ఇది ఎమోషనల్‌ వీడియో..!

అన్నదమ్ముల ప్రేమ.. ఇది ఎమోషనల్‌ వీడియో..!

హైదరాబాద్‌: మీలో ఆనందాన్ని నింపే వీడియోలు ఇంటర్నెట్‌లో ఎన్నో ఉంటాయి. కానీ, మళ్లీ మళ్లీ చూడాలనిపించే భావోద్వేగపూర్వకమైనవి కొన్నే ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ అన్నదమ్ములమధ్య ప్రేమను చూపించే వీడియో. సోషల్‌ మీడియలో ఇది తెగ వైరల్‌ అవుతోంది. 

క్లిప్‌విల్‌, హెన్రీ క్లాసెన్‌ ఇద్దరు అన్నదమ్ములు. క్లిప్‌విల్‌ పెళ్లి సందర్భంగా వారి తోటలో ఏర్పాట్లకోసం భూమిని చదును చేస్తున్నారు. ఈ సమయంలో హెన్రీ క్లాసెస్‌కు ఓ బాటిల్‌ దొరికింది. అందులో ఏదో పేపర్‌ కనిపించింది. అందులో ఏముంది చదువు అని క్లిప్‌విల్‌కు కాబోయే భార్య కోరగా, హెన్రీ దాన్ని గట్టిగా చదివాడు.. ‘హెన్రీ జో, నువ్వు ఇప్పటికే నా బెస్ట్ బ్రో, నా బెస్ట్ ఫ్రెండ్.. కాబట్టి నువ్వు అవును అని చెప్పి నా బెస్ట్ మ్యాన్ అవుతావా?’ అని ఉంది. ఇది క్లిప్‌విల్‌ రాసిపెట్టిందే అని తెలుసుకున్న హెన్రీ ఒక్కసారిగా అతడి సోదరుడిని హత్తుకుంటాడు. కొద్దిసేపటికి వారి పెంపుడుకుక్కకూడా వారితో జతకడుతుంది. భావోద్వేగంతో నిండిపోయిన ఈ వీడియోను క్లిప్‌విల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా, కొద్దిసేపటి తర్వాత దీన్ని బాస్కెట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు రెక్స్‌ చాప్‌మన్‌ రీపోస్ట్‌ చేశాడు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.  ఇప్పటివరకూ 3.8 మిలియన్లకు పైగా వీక్షించారు. 1.39 లక్షల లైక్స్‌ వచ్చాయి. 


logo