సోమవారం 25 జనవరి 2021
International - Jan 11, 2021 , 01:38:15

బ్లాక్‌ బాక్సుల ఆచూకీ లభ్యం

బ్లాక్‌ బాక్సుల ఆచూకీ లభ్యం

  • జావా సముద్రంలో విమాన శకలాలు

జకర్తా: అదృశ్యమైన ఇండొనేషియా విమానానికి సంబంధించిన రెండు బ్లాక్‌ బాక్స్‌ల ఆచూకీ లభ్యమైందని అధికారులు ఆదివారం వెల్లడించారు. వాటి నుంచి వెలువడిన ఎమర్జెన్సీ సిగ్నళ్లను ఓ నావికాదళ నౌకలోని సోనార్‌ వ్యవస్థ గుర్తించినట్టు చెప్పారు. త్వరలోనే బ్లాక్‌బాక్స్‌లను వెలికితీస్తామని, అందులోని సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల కారణమేంటో తెలుసుకొనేందుకు వీలవుతుందని మిలిటరీ చీఫ్‌ హడీ తజజంటో తెలిపారు. అంతకుముందు జావా సముద్రంలో 75 అడుగుల లోతులో విమానానికి సంబంధించిన పలు శకలాలను గుర్తించారు. విమానం కూలిన ప్రదేశం అదేనని భావిస్తున్నారు.  


logo