బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 13:18:05

ఆప్ఘన్‌లో కూలిన మిలటరీ హెలికాప్టర్‌.. ఇద్దరు పైలెట్లు దుర్మరణం

ఆప్ఘన్‌లో కూలిన మిలటరీ హెలికాప్టర్‌.. ఇద్దరు పైలెట్లు దుర్మరణం

బాగ్లాన్‌ : ఆప్ఘనిస్థాన్‌లోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లో మిలటరీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం చెందినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. బాగ్లాన్‌ ప్రావిన్స్‌ పూల్‌-ఈ-కుమ్రీ నగరంలోని కప్రాక్‌ ప్రాంతంలో ఎండీ530 హెలికాప్టర్‌ సాంకేతిక లోపంతో ఈ తెల్లవారుజూమున 5 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో ఆప్ఘన్‌ వాయుసేనకు చెందిన ఇద్దరు పైలెట్లు మృతి చెందారని రక్షణశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. పైలెట్ల మృతికి రక్షణ మంత్రిత్వశాఖ జనరల్‌  అసదుల్లా ఖలీద్‌ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo