బుధవారం 03 జూన్ 2020
International - May 13, 2020 , 08:46:20

ఎన్నాళ్లైనా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌.. ట్విట్ట‌ర్ ఉద్యోగుల‌కు ఆఫ‌ర్‌

ఎన్నాళ్లైనా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌..  ట్విట్ట‌ర్ ఉద్యోగుల‌కు ఆఫ‌ర్‌

హైద‌రాబాద్‌: ట్విట్ట‌ర్ సంస్థ ఉద్యోగుల‌కు ఇది శుభ‌వార్త‌. ఆ కంపెనీ ఉద్యోగులు ఇక నుంచి ఎప్ప‌టి వ‌ర‌కైనా ఇంటి నుంచే ప‌నిచేయ‌వ‌చ్చు. వ‌ర్క్ ఫ్ర‌మ్ శాశ్వ‌తంగా కాంటిన్యూ చేయ‌వ‌చ్చు అని ఆ సంస్థ వెల్ల‌డించింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఆ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న‌ది. అయితే మార్చి నుంచి ఆంక్ష‌ల వ‌ల్ల సుమారు 5వేల మంది ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు. ఒక‌వేళ ఉద్యోగులు త‌మ బాధ్య‌త‌లకు త‌గిన‌ట్లు ప‌నిచేస్తే, వారు ఆఫీసుకు రానవ‌స‌రం లేద‌న్నారు.   గ‌త కొన్ని నెల‌ల నుంచి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నార‌ని, అయితే ప‌నిలో ఎటువంటి తేడా రాలేద‌ని, అందుకే ఇదే త‌ర‌హా ప‌నిని కొన‌సాగించ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ సంస్థ వెల్ల‌డించింది.

ఉద్యోగులు ఇంటి నుంచే ప‌ని చేసేందుకు ఇష్ట‌ప‌డితే వారికి ఆ వెస‌లుబాటు క‌ల్పించ‌నున్న‌ట్లు సీఈవో జాక్ డోర్సీ తెలిపారు. ఈ విష‌యాన్ని ఆయ‌న మెయిల్ ద్వారా ఉద్యోగుల‌కు తెలియ‌జేశారు. ఇక ఇంటి నుంచి ప‌నిచేయలే‌ని ఉద్యోగుల కోసం మాత్రం ఆఫీసును ఈ ఏడాది చివ‌ర్లో ఓపెన్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.  సెప్టెంబ‌ర్ ముందు క‌న్నా ఆఫీసులు తెరుచుకోవ‌న్నారు.  ట్విట్ట‌ర్ సంస్థ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 35 ఆఫీసులు ఉన్నాయి.  న్యూఢిల్లీ, లండ‌న్‌, సింగ‌పూర్‌ల‌లో కూడా ఆఫీసులు ఉన్నాయి.  ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఇంటి నుంచి ప‌నిచేయ‌వ‌చ్చు అని ఫేస్‌బుక్‌, గూగుల్ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు ఆదేశాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. logo