బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 13:16:14

ఇంటి నుంచి పనిచేయండి.. ఉద్యోగులకు ట్విట్టర్‌ ఆదేశాలు..!

ఇంటి నుంచి పనిచేయండి.. ఉద్యోగులకు ట్విట్టర్‌ ఆదేశాలు..!

టోక్యో: మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ తన ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ట్విట్టర్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్‌, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియాలలోని ట్విట్టర్‌ కార్యాల‌యాల్లో ప‌నిచేస్తున్న సుమారు 5వేల మంది  ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని  ఆ సంస్థ‌ ఆదేశించింది. కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విట్టర్‌ వెల్లడించింది. అయితే అమెరికాలో ఉన్న ట్విట్టర్‌ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ఆ కంపెనీ తెలిపింది. logo