శనివారం 28 నవంబర్ 2020
International - Oct 30, 2020 , 12:17:17

ఫ్రాన్స్ దాడి.. మాజీ ప్ర‌ధాని ట్వీట్ తొల‌గింపు

ఫ్రాన్స్ దాడి..  మాజీ ప్ర‌ధాని ట్వీట్ తొల‌గింపు

హైద‌రాబాద్‌: ఫ్రాన్స్‌లోని నీస్ న‌గ‌రంలో ఓ చ‌ర్చిపై జ‌రిగిన దాడికి సంబంధించి మ‌లేషియా మాజీ ప్ర‌ధాని మ‌హ‌తిర్ మొహ‌మ్మ‌ద్ చేసిన ట్వీట్‌ను ఆ సంస్థ డిలీట్ చేసింది.  హింస‌ను ప్రేరేపించే విధంగా ఆ ట్వీట్ ఉంద‌ని, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఆ ట్వీట్‌ను తొల‌గిస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ సంస్థ పేర్కొన్న‌ది.  నీస్ న‌గ‌రంలో ఓ ఉన్మాది.. క‌త్తితో దాడి చేసి ముగ్గుర్ని హ‌త మార్చాడు.  ఓ మ‌హిళ త‌ల‌ను కోసేశాడ‌త‌ను.  అయితే ఆ ఘ‌ట‌న ప‌ట్ల మ‌హ‌తిర్ చేసిన ట్వీట్‌పై ఆన్‌లైన్‌లో తీవ్ర  ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యింది.  సోష‌ల్ మీడియా యూజ‌ర్లు మ‌హ‌తిర్ అకౌంట్‌ను స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు.  తొలుత ట్విట్ట‌ర్  సంస్థ ఆ ట్వీట్‌కు క‌ల‌ర్ మార్క్ ఇచ్చినా.. ఆ త‌ర్వాత దాన్ని డిలీట్ చేసింది.  ఇటీవ‌ల ఫ్రాన్స్‌లో ఓ స్కూల్ టీచ‌ర్ త‌ల న‌రికివేసిన ఘ‌ట‌న ప‌ట్ల అధ్య‌క్షుడు మాక్ర‌న్ స్పందిస్తూ .. ఇస్లామిక్ తీవ్ర‌వాదం పెరిగిన‌ట్లు ఆరోపించారు. అయితే మాక్ర‌న్ కామెంట్ల‌పై మ‌హ‌తిర్ వ‌రుస‌గా ట్వీట్ల‌తో రియాక్ట్ అయ్యారు.