శనివారం 30 మే 2020
International - Apr 08, 2020 , 10:48:28

బిలియ‌న్ డాల‌ర్ల విరాళం ప్ర‌క‌టించిన ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు

బిలియ‌న్ డాల‌ర్ల విరాళం ప్ర‌క‌టించిన ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు

హైద‌రాబాద్‌: సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ డాబిలియ‌న్ డాల‌ర్ల విరాళం ప్ర‌క‌టించిన ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడుర్సే భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. కోవిడ్‌19పై పోరాటానికి బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌న సంప‌ద‌లోని 28 శాతాన్ని విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు డార్సే పేర్కొన్నారు. త‌న వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న ఈ స‌మాచారాన్ని తెలిపారు. అయితే తాను ఇవ్వ‌బోయే నిధుల‌ను ఎవ‌రికి ఇస్తార‌న్న విష‌యాన్ని ఆయ‌న ఇంకా వెల్ల‌డించ‌లేదు. ప్ర‌స్తుతానికి అమెరికాలో వెంటిలేట‌ర్లు, పీపీఈల కొర‌త ఉన్న‌ది. స్క్వేర్ సంస్థ‌లో ఉన్న‌  త‌న షేర్ల‌ను విరాళం రూపంలో వినియోగించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. సార్ట్ స్మాల్ ఫౌండేష‌న్ ద్వారా వీటిని ఖ‌ర్చు చేస్తారు. ట్విట్ట‌ర్‌తో పాటు స్క్వేర్ సంస్థ‌కు కూడా డార్సీ సీఈవోగా ఉన్నారు.  అయితే విరాళం కోసం వాడే షేర్ల‌న్నీ స్క్వేర్ సంస్థ‌వే అన్నారు. బాలిక‌ల చ‌దువు, ఆరోగ్యం, ప‌రిశోధ‌న గురించి వాటిని వినియోగించ‌నున్న‌ట్లు జాక్ డార్సే చెప్పారు. logo