ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 16, 2020 , 08:59:39

ఒబామా, గేట్స్‌, బేజోస్‌.. ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాక్‌

ఒబామా, గేట్స్‌, బేజోస్‌.. ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాక్‌

హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన ప్ర‌ముఖుల ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గుర‌య్యాయి.  బిట్‌కాయిన్ స్కామ్‌తో ఆ హ్యాకింగ్‌కు సంబంధం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  బిలియ‌నీర్లు ఎల‌న్ మస్క్‌, జెఫ్ బీజోస్‌, బిల్ గేట్స్ లాంటి ప్ర‌ముఖుల ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాకయ్యాయి. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా, జోసెఫ్ బైడెన్‌, కేయిన్ వెస్ట్ లాంటి వారి అకౌంట్లు హ్యాకింగ్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. క్రిప్టోక‌రెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వాలంటూ బిలియ‌నీర్ల‌కు, రాజ‌కీయ‌వేత్త‌ల‌కు ట్వీట్లు వెళ్లాయి.  మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది.  విరాళాలు ఇవ్వండి అంటూ అత‌ని ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్టు అయ్యింది.  మీరు వెయ్యి డాల‌ర్లు పంపిస్తే, నేను మీకు రెండు వేల డాల‌ర్లు పంపిస్తానంటూ గేట్స్ అకౌంట్‌లో ఓ హ్యాకైన ట్వీట్ ప్ర‌త్య‌క్ష‌మైంది. 

ప్ర‌ముఖుల అకౌంట్లు హ్యాక్ కావ‌డం ప‌ట్ల ట్విట్ట‌ర్ స్పందించింది.  ఇది చాలా క‌ష్ట‌త‌ర‌మైన రోజు అని ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీ స్పందించారు. అకౌంట్ల హ్యాకైన ఘ‌ట‌న ప‌ట్ల స‌మీక్ష చేస్తున్న‌ట్లు చెప్పారు.  బ్లూ మార్క్ టిక్స్ ఉన్న అకౌంట్ల‌ను ట్వీట్ చేయ‌కుండా ఆ  సంస్థ ఆపేసింది. యాపిల్ సంస్థ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది. స్పేస్ఎక్స్ సంస్థ చీఫ్ మ‌స్క్ అకౌంట్ కూడా హ్యాకైంది.  30 నిమిషాల్లో త‌న అకౌంట్‌కు బిట్‌కాయిన్ పేమెంట్ చేస్తే, రెట్టింపు డ‌బ్బు వాప‌స్ ఇవ్వ‌నున్న‌ట్లు హ్యాకైన ట్వీట్ క‌నిపించింది. కోవిడ్‌19 నేప‌థ్యంలో తాను ఈ విరాళం ఇవ్వ‌నున్న‌ట్లుగా ఆ ట్వీట్‌లో ఉన్న‌ది. అయితే పోస్టు అయిన కొన్ని క్ష‌ణాల్లోనే ఆ ట్వీట్ల‌ను తొల‌గించారు.
logo