టర్కీలో కరోనా టీకా పంపిణీకి ప్లాన్ ఖరారు

హైదరాబాద్: టర్కీ దేశం వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రకటించింది. దేశ ప్రజలకు ఈనెల 11వ తేదీ తర్వాత కోవిడ్ టీకాను ఇవ్వనున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫరెట్టిన్ కోకా తెలిపారు. తొలుత హెల్త్ వర్కర్లకు ఆ టీకా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. చైనా కంపెనీ తయారు చేస్తున్న కరోనావాక్ టీకాను టర్కీ కొనుగోలు చేసింది. సుమారు కోటి డోసులు టీకాలను డిసెంబర్లోనే ఇవ్వనున్నామని, ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరో కోటి డోసులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. చైనా వద్ద 5 కోట్ల డోసులు కొనేందుకు టర్కీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే ఇతర దేశాలకు చెందిన టీకాలను ఫార్మసీల్లో అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జర్మనీ వద్ద 2.5 కోట్ల కోవిడ్ టీకా డోసులు ఖరీదు చేసేందుకు ప్లాన్ వేశామని టర్కీ మంత్రి తెలిపారు. చైనాకు చెందిన సైనోవాక్, అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీలు తమ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను టర్కీలో నిర్వహిస్తున్నాయి. సైనోవాక్ టీకా మూడవ దశ ట్రయల్స్‌ను సెప్టెంబర్‌లోనే ప్రారంభంచారు. ఇప్పటికే వేలాది మంది వాలంటీర్లు ఆ టీకా తీసుకున్నారు. ఫైజర్ కూడా టర్కీలో ట్రయల్స్ చేసింది. వాలంటీర్లలో 98 శాతం యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
తాజావార్తలు
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- భారత్ గిఫ్ట్.. స్వీకరించిన భూటాన్ ప్రధాని
- క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్!
- కమలా హ్యారిస్ సొంతూరులో వేడుకలు