శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 26, 2020 , 02:07:42

టర్కీలో భూకంపం.. 29 మంది మృతి

టర్కీలో భూకంపం.. 29 మంది మృతి

ఇలాజిజ్‌: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ప్రాంతంలోని ఇలాజిజ్‌ ప్రావిన్స్‌లోని సివ్‌రిస్‌లో శుక్రవారం రాత్రి సంభవించిన ఈ భూకంపం వల్ల 29మంది మరణించగా, సుమారు 1,015 మంది ప్రజలు గాయపడ్డారు. రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రత నమోదుకాగా పలు భవనాలు, ఇండ్లు నేలమట్టమయ్యాయి. కొన్ని చోట్ల అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. కొంత సమ యం వరకు వరుస ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లను వీడి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల తాము చాలా భయపడ్డామని, ఇండ్లలోని సామాన్లు తమపై పడ్డాయని కొందరు తెలిపారు. ఇలాజిజ్‌కు 30 కి.మీ దూరంలోని గ్రామంలో ఐదంస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 30 మంది గల్లంతయ్యారని టర్కీ వెల్లడించింది.
logo