మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 13:11:01

టర్కీలో 2.46 లక్షలకు చేరిన కరోనా కేసులు

టర్కీలో 2.46 లక్షలకు చేరిన కరోనా కేసులు

అంకార : టర్కీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదువుతుండగా మరణాల సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 1,226 కేసులు నమోదు కాగా 923 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 21 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో  2,46,861మంది వైరస్‌ బారినపడగా 5,934 ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మంది మృతి చెందారని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెటిన్ కోకా ట్విట్టర్లో తెలిపారు. ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్ల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 7.61 లక్షల మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. 


logo