శనివారం 06 జూన్ 2020
International - May 09, 2020 , 08:46:23

ట‌ర్కీలో 135,569, ఇరాన్‌లో 104,691కి చేరిన క‌రోనా కేసులు

ట‌ర్కీలో 135,569, ఇరాన్‌లో 104,691కి చేరిన క‌రోనా కేసులు

కైరో: ట‌ర్కీలో క‌రోనా పాజిటివ్ ఈ రోజు 1,848 కొత్తగా పాజిటివ్ కేసులు రావ‌డంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 135,569కు చేరుకుంది. ట‌ర్కీలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,689 మంది మ‌ర‌ణించ‌గా, గ‌డిచిన 24 గంట‌ల్లో 48 మంది బాధితులు మృత్యు‌వాత‌ప‌డ్డారు. దేశంలో మొత్తం బాధితుల్లో చికిత్స అనంత‌రం 86,396 మంది కోలుకున్నారు. 

ఇరాన్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 1556 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 55 మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో కోవిడ్ -19 మృతుల సంఖ్య 6,541కి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం వైర‌స్ బాధితుల సంఖ్య 104,691కి చేరుకోగా ఇందులో చికిత్స అనంత‌రం 83,837 మంది బాధితులు చికిత్స అనంత‌రం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

సౌదీ అరేబియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,701 కొత్త క‌రోనా కేసులు న‌మోదు కాగా, 10 మంది బాధితులు మృత్యువాత ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 229 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు.  మొత్తం కేసుల సంఖ్య 35,432 కాగా చికిత్స అనంత‌రం 9,120 మంది బాధితులు కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్ అయ్యారు.  


logo