శనివారం 30 మే 2020
International - May 05, 2020 , 08:32:58

క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు స‌డ‌లించిన ట‌ర్కి ప్ర‌భుత్వం

క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు స‌డ‌లించిన ట‌ర్కి ప్ర‌భుత్వం

అంకారా: మ‌ర‌ణాల రేటు త‌గ్గ‌డంతో పాటు క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గ‌డంతో ట‌ర్కి ప్ర‌భుత్వం దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో క‌ర్ప్యూను స‌డ‌లిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వైర‌స్ వ్యాప్తి పెరిగితే నిబంధ‌న‌లు మ‌ళ్లీ క‌ఠినం చేస్తామ‌ని ఆ దేశ అధ్య‌క్షుడు రెసెప్ త‌య్యిప్ ఎర్డోగాన్ ప్ర‌క‌టించారు. మే 11వ తేదీ నుంచి షాపింగ్‌మాల్స్‌, సెలూన్‌లు, బ్యూటీపార్ల‌ర్లు, తెరుచుకుంటాయ‌ని వెల్ల‌డించారు. త‌క్క‌వ సంఖ్య‌లో వినియోగ‌దారుల‌ను లోప‌లికి అనుమ‌తించి సేవ‌లు అందించేలా నిబంధ‌న‌లు రూపొందించామ‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌క్కువ‌గా ఉన్న ఏడు న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూను ఎత్తివేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే ఇస్తాంబుల్‌, అంకారాతో స‌హా మ‌రో 24 న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు క‌ఠినంగా ఉంటాయ‌ని చెప్పారు. 

ఆరు వారాల‌కుపైగా క్వారంటైన్‌లో ఉన్న 65 సంవ‌త్స‌రాల వృద్ధులు, 10 సంవ‌త్స‌రాలలోపు పిల్ల‌లు ఇంటి బ‌య‌ట, ప‌రిస‌రాల్లో నిడిచేందుకు మే 13వ తేదీ నుంచి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వైర‌స్‌ను అరిక‌ట్ట‌డంతో క‌ర్ఫ్యూ ద్వారా కొంత విజ‌యం సాధించామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు పాటించ‌పోతే వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తుంద‌ని, దీంతో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 64  కోవిడ్ 19 కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఆదివారం ఒక్క‌రోజే 61 మంది బాధితులు మృత్యువాత ప‌డ్డారని ఆ దేశ వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. మొత్తం దేశంలో 127,695 కేసులు క‌రోనాపాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 3461 మంది మ‌ర‌ణించారు. 


logo