సోమవారం 13 జూలై 2020
International - Jun 24, 2020 , 07:15:16

మెక్సికోలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక

మెక్సికోలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక

మెక్సికో సిటీ: మెక్సికోలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. భూకంపం తీవ్రత 7.7గా ఉందని, ఒక్సాకాలో భూకంప కేంద్ర ఉన్నదని అమెరికా జియలాజికల్‌ సర్వే ప్రకటించింది. అమెరికా, కెనడా దేశాల పర్యాటకులు సందర్శించే హువాతుల్లో బీచ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప తీవ్రతతో ఆరుగురు మరణించగా, సుమారు రెండు వందల ఇండ్లు దెబ్బతిన్నాయని ఒక్సాకా రాష్ట్ర గవర్నర్‌ అలెజంద్రో మూరత్‌ ప్రకటించారు. భూకంప ప్రభావంతో వందల కిలోమీటర్ల దూరంలోని దేశ రాజధాని మెక్సికోసిటీలో భవనాలు కంపించాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

భూకంప ప్రభావంతో ఒక్సాకా తీరంలోని సముద్ర నీటిమట్టం 60 సెంటీమీర్ల మేర పెరిగిందని మెక్సికో సెస్మాలజీ సర్వీస్‌ అధికారులు తెలిపారు.  తీవ్ర భూకంపం వల్ల మెక్సికో సముద్ర తీరప్రాంతంలో 3.28 అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉన్నదని అమెరికా నేషనల్‌ ఓషియానిక్‌ అధికారులు వెల్లడించారు. 2017లో సెంట్రల్‌ మెక్సికోలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో 355 మంది మరణించారు. 


logo