శనివారం 31 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 07:24:19

టిక్‌టాక్‌పై నిషేధానికి బ్రేక్‌.. కొలంబియా కోర్టు నిర్ణయం

టిక్‌టాక్‌పై నిషేధానికి బ్రేక్‌.. కొలంబియా కోర్టు నిర్ణయం

న్యూయార్క్ ‌: టిక్‌టాక్‌ యాప్‌ నిషేధం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయకుండా నిషేధం విధించిన ట్రంప్‌ కార్యనిర్వహక ఉత్తర్వులకు డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలోని జిల్లా కోర్టు బ్రేక్‌ వేసింది. అయితే నవంబర్‌ 12 నుంచి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను కూడా వాయిదా కోర్టు తోసిపుచ్చింది. కాగా చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ను ట్రంప్‌ సర్కార్‌ ఇటీవల నిషేధించడం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.