గురువారం 28 మే 2020
International - Apr 17, 2020 , 15:17:13

ట్రంప్ మాజీ లాయ‌ర్ జైలు నుంచి రిలీజ్‌..

ట్రంప్ మాజీ లాయ‌ర్ జైలు నుంచి రిలీజ్‌..


హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ వ‌ద్ద లాయ‌ర్‌గా చేసిన మైఖేల్ కోహెన్ ప్ర‌స్తుతం జైలు శిక్ష అనుభ‌విస్తున్నాడు.  అయితే ఖైదీల్లో క‌రోనా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న్ను కూడా రిలీజ్ చేయ‌నున్నారు. ప‌లు కేసుల్లో దోషిగా తేలిన కోహెన్‌కు మూడేళ్ల జైలు శిక్ష ప‌డింది. ఎన్నిక‌ల ప్ర‌చార వేళ కోహెన్ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డాడు. ఆ కేసులో అత‌ను అమెరికా కాంగ్రెస్‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చారు. దీంతో ఆయ‌న్ను అరెస్టు చేసి న్యూయార్క్‌లోని ఓటిస్‌విల్లీ జైలులో బంధించారు. అయితే ఆ జైలులో ఉన్న కొంద‌రు ఖైదీల‌కు, సిబ్బందికి వైర‌స్ సోకిన‌ట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హింసాత్మ‌క నేర చ‌రిత్ర లేని వారిని విడుద‌ల చేసేందుకు ప్రిజ‌న్స్ బ్యూరీ అంగీక‌రించింది.   దీనిలో భాగంగా ట్రంప్ మాజీ లాయ‌ర్‌ను కూడా రిలీజ్ చేయ‌నున్నారు.

 


logo