గురువారం 13 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 19:09:28

భారత్ కు ట్రంప్ మద్దతుపై గ్యారంటీ లేదు

భారత్ కు ట్రంప్ మద్దతుపై గ్యారంటీ లేదు

న్యూఢిల్లీ : భారత్-చైనాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి వివాదాస్పద ప్రకటన చేశారు. చైనా-ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మద్దతు ఇస్తారనే గ్యారెంటీ లేదని అన్నారు. ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ ఈ విషయం చెప్పారు.

చైనా తన అన్ని సరిహద్దుల్లో దూకుడుగా ప్రవర్తిస్తున్నదని, ఈ కారణంగా, జపాన్, ఇండియా, ఇతర దేశాలతో దాని సంబంధాలు క్షీణించాయని చెప్పారు. చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినపఓంలో భారత్ వైపు ట్రంప్ నిలుస్తాడనేది అనుమానమే అని తెలిపారు. నవంబర్ ఎన్నికల తరువాత ట్రంప్ ఇంకా ఏం చేస్తారో చెప్పలేమన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందానికి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోవద్దని సూచించారు. రాబోయే కొద్ది నెలల్లో ట్రంప్ ఇలాంటి అన్ని విషయాల నుంచి పక్కకు తప్పింకుంటారని, ఈ సారి తనను ఎన్నుకోవడం కష్టమని తెలిసినందున సరిహద్దులో శాంతినే కోరుకుంటారని బోల్టన్ పేర్కొన్నారు.

ట్రంప్ పరిపాలనలో 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ సేవలందించారు.


logo