మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 08, 2020 , 09:59:23

ఓటమిని అంగీకరించని ట్రంప్‌

ఓటమిని అంగీకరించని ట్రంప్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించడం లేదు. తాను ఏడుకోట్లకుపైగా ఓట్లు సాధించి గెలుపొందినట్లు ట్వీట్‌ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పరిశీలకులను అనుమతించలేదని ట్రంప్‌ ఆరోపించారు. మిలియన్ల కొద్దీ మెయిల్‌ ఇన్‌ ఓట్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓ అధ్యక్షుడికి ఏడుకోట్లకుపైగా చట్టబద్ధమైన ఓట్లు రావడం ఇదే అత్యధికమంటూ ట్వీట్‌ చేశారు. కాగా, హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ట్రంప్‌ ఓడిపోయారు. 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకుగాను బైడెన్‌ 290 ఓట్లు సాధించి గెలుపొందారు. ఎన్నికల్లో ట్రంప్‌ 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో విజయంతో బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని దాటి, అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.