ఆదివారం 07 జూన్ 2020
International - Mar 31, 2020 , 11:17:13

3 వేలు దాటిన మృతులు.. రిపోర్ట‌ర్‌పై ట్రంప్ ఆగ్ర‌హం

3 వేలు దాటిన మృతులు..  రిపోర్ట‌ర్‌పై ట్రంప్ ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌: అమెరికాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది.  జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ విష‌యాన్ని చెప్పింది. ఆ దేశంలో మ‌ర‌ణాల సంఖ్య 3008కి చేరుకున్న‌ది. మొత్తం ల‌క్షా 60 వేల మందికి వైర‌స్ సోకింది. మ‌రోవైపు ఇవాళ వైట్‌హౌజ్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన ట్రంప్‌.. ఓ జ‌ర్న‌లిస్టుపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.  అన‌వ‌స‌ర ప్ర‌శ్న‌లు అడ‌గ‌వ‌ద్దు అంటూ ఆవేశానికి లోన‌య్యారు.  అమెరికాలో ప‌ది ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ట్రంప్ తెలిపారు. ఇదో మైలురాయి అని అన్నారు.  ఆ స‌మ‌యంలో ఓ రిపోర్ట‌ర్ ఓ ప్ర‌శ్న వేశారు. ద‌క్షిణ కొరియా త‌ర‌హాలో ఎందుకు ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌డంలేద‌ని ఆ జ‌ర్న‌లిస్టు అడిగారు. ద‌క్షిణ కొరియా గురించి నీక‌న్నా నాకే ఎక్కువ తెలుసు అని ట్రంప్ అన్నారు. అప్పుడు ఆ రిపోర్ట‌ర్‌.. ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ ఎంత పెద్ద‌గా ఉంటుందో తెలుసా అని ప్ర‌శ్నించారు. దానికి వెంటనే ట్రంప్ .. ఆ న‌గ‌రంలో 38 మిలియ‌న్ల జ‌నాభా ఉంద‌న్నారు.  కానీ ట్రంప్ తొంద‌ర‌లో త‌ప్పు చెప్పేశారు.  సియోల్‌లో కేవ‌లం 10 మిలియ‌న్ల జ‌నాభా మాత్ర‌మే ఉన్న‌ది. చివ‌ర‌కు పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు వేయ‌వ‌ద్దూ అంటూ ఆ జ‌ర్న‌లిస్టును ట్రంప్ హెచ్చ‌రించారు.





logo