శుక్రవారం 05 జూన్ 2020
International - May 01, 2020 , 12:31:53

నెల రోజుల త‌ర్వాత‌ వైట్‌హౌజ్ బ‌య‌ట అడుగుపెట్ట‌నున్న‌ ట్రంప్..

నెల రోజుల త‌ర్వాత‌ వైట్‌హౌజ్ బ‌య‌ట అడుగుపెట్ట‌నున్న‌ ట్రంప్..

‌హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ గ‌త నెల రోజుల నుంచి అధికారిక భ‌వ‌నం వైట్‌హౌజ్‌లోనే ఉన్నారు. మార్చి 28వ తేదీన నుంచి ఆయ‌న వైట్‌హౌజ్‌లోనే ఉంటున్నారు. దేశంలో క‌రోనా విల‌యం సృష్టిస్తున్నా.. ఆయ‌న అక్క‌డ నుంచే మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వ‌చ్చారు.  ఇవాళ తొలిసారి నెల రోజుల విరామం త‌ర్వాత వైట్‌హౌజ్ దాటి ట్రంప్ అడుగు బ‌య‌ట‌పెట్ట‌నున్నారు.  మేరీల్యాండ్‌లో జ‌ర‌గ‌నున్న క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియ‌ల్ రిట్రీట్‌కు ఆయ‌న వెళ్ల‌నున్నారు. శుక్ర‌వారం సాయంత్రం ట్రంప్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అయితే ఆ క్యాంపు వ‌ద్ద ఎంత సేపు స‌మ‌యం వెచ్చిస్తార‌న్న విష‌యం తెలియ‌దు.  

మార్చి 28వ తేదీన చివ‌రిసారి వ‌ర్జీనియా రాష్ట్రంలోని నోర్‌ఫ్లాక్‌కు ట్రంప్ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న నేవీకి చెందిన కంఫ‌ర్ట్ హాస్పిట‌ల్ షిప్‌కు ఫేర్‌వెల్ ప‌లికారు. ఆ త‌ర్వాత ఆ షిప్ న్యూయార్క్ సిటీకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  సివిల్ హాస్పిట‌ళ్ల‌కు తోడుగా ఉండేందుకు షిప్ హాస్పిట‌ల్‌ను స్టార్ట్ చేశారు. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోనూ పోటీ  చేయ‌నున్న ట్రంప్‌..  ఓ బిజినెస్ మీట్ కోసం వ‌చ్చే వారం ఆరిజోనా వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 


logo