బుధవారం 20 జనవరి 2021
International - Jan 11, 2021 , 01:55:14

ట్రంప్‌ వర్గం సామాజిక బహిష్కరణ!

ట్రంప్‌ వర్గం సామాజిక బహిష్కరణ!

వాషింగ్టన్‌, జనవరి 10: బైడెన్‌ విజయాన్ని వ్యతిరేకిస్తూ క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి తెగబడిన ట్రంప్‌ వర్గానికి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. టెక్‌ సంస్థలు, మీడియా, విమానయాన సంస్థలు, పౌరసంఘాలు ఈ అల్లరి మూకలను గుర్తించి బహిష్కరిస్తున్నాయి. దాడిలో పాల్గొన్న వారిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలిగిస్తున్నాయి. మొత్తంగా వారిని సామాజిక బహిష్కరణ చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో వాషింగ్టన్‌ డీసీ నుంచి ఫోనిక్స్‌కు వెళ్తున్న విమానంలో ట్రంప్‌ మద్దతుదారులు నినాదాలు చేయడంతో.. మధ్యలోనే విమానాన్ని ఆపేస్తానంటూ పైలట్‌ హెచ్చరించారు. 


logo