బుధవారం 08 జూలై 2020
International - May 29, 2020 , 13:22:25

సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌పై ట్రంప్ పంజా..

సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌పై ట్రంప్ పంజా..

హైద‌రాబాద్‌:  సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌పై ట్రంప్ పంజా విసిరారు.  ఆ మీడియా సంస్థ‌ల‌కు ఉన్న న్యాయ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ల‌ను తొల‌గిస్తూ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ జారీ చేశారు.  కొత్త ఆదేశాల ప్ర‌కారం ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ లాంటి సంస్థ‌ల‌పై న్యాయ‌ప‌ర‌మైన విచార‌ణ చేప‌ట్ట‌వ‌చ్చు.  యూజ‌ర్లు ఇస్తున్న‌ కాంటెంట్ ఆధారంగా ఆ లీగ‌ల్ చ‌ర్య‌లు ఉంటాయి. నిఘాలేని అధికారాలు క‌లిగి ఉన్న సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు చెక్ పెట్ట‌నున్న‌ట్లు ట్రంప్ త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల‌కు ఉన్న న్యాయ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను తొల‌గించాలంటే ఉభ‌య‌స‌భ‌ల్లో లేదా కోర్టు వ్య‌వ‌స్థ ద్వారా మార్పులు చేయాల్సి ఉంటుంది. 

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విట్ట‌ర్ జోక్యం చేసుకుంటున్న‌ట్లు తాజాగా ట్రంప్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.  ట్రంప్ చేసిన రెండు ట్వీట్ల‌కు ట్విట్ట‌ర్‌ ఫ్యాక్ట్ లేబుల్ చెక్ పెట్టింది. దీంతో ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్‌ను బ్యాన్ చేస్తా అని ఆయ‌న అన్నారు.  క‌మ్యూనికేష‌న్స్ డీసెన్సీ యాక్ట్‌లోని 230వ సెక్ష‌న్ ప్ర‌కారం.. పోస్టు పెట్టిన‌వారే త‌మ కాంటెంట్‌కు బాధ్యులుగా ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రూల్ ..  సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచింది. కానీ యూజ‌ర్ పెట్టిన పోస్టును ఎవ‌రైనా ఎడిట్ చేస్తే, అప్పుడు అది రూల్‌ను అతిక్ర‌మించిన‌ట్లే అని ట్రంప్ త‌న తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌లో పేర్కొన్నారు. 230 సెక్ష‌న్‌ను మార్చ‌నున్న‌ట్లు ట్రంప్ త‌న ఆదేశంలో తెలిపారు.logo