గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 09, 2020 , 17:46:12

మూడు ఆర్థిక ఉపశమన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం

మూడు ఆర్థిక ఉపశమన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం

వాషింగ్టన్ : దేశ ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించే మూడు ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సంతకం చేశారు. న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లోని తన గోల్ఫ్ క్లబ్‌లో ఆయన వీటి గురించి మీడియాకు వెల్లడించారు. అమెరికా దేశ ప్రజల ఉద్యోగాలు, ఆర్థిక సహాయాన్ని కాపాడటానికి ప్రతి అడుగు వేస్తామం. ఈ ఉత్తర్వు జారీ చేయడం అంటే ఉపశమనం మొత్తం త్వరలో ప్రజలకు అందుతుందని చెప్పారు.

"దేశంలో భౌతిక దూరం కారణంగా వ్యాపార పరిస్థితులు క్షీణించాయి. నిరుద్యోగిత రేటు రెండంకెకు చేరుకున్నది. చాలా మంది ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీపై ఆధారపడి ఉన్నారు. ప్రజల ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్యాకేజీని పార్లమెంటు ఆమోదించింది. అయితే, అది జూలైలో ముగిసింది. అటువంటి పరిస్థితిలో నేను ప్యాకేజీకి అనుసంధానించబడిన ఆర్డర్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. పన్నులు తగ్గించే ప్రణాళికలో కూడా పని చేస్తున్నాను" అని ట్రంప్ చెప్పారు.

ట్రంప్ సంతకం చేసిన మూడు ఉత్తర్వులలో ఒకటి.. ప్రతి వారం 400 డాలర్లు (సుమారు రూ.30,000) నిరుద్యోగ భత్యంగా ఇచ్చేందుకు అనుమతిస్తుంది. మరో రెండు ఆర్డర్లు తొలగింపు నిబంధనలకు సంబంధించినవి. విద్యార్థుల రుణాలలో ఉపశమనం ఇస్తాయి. ఈ ప్యాకేజీని ట్రంప్ యొక్క రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రాట్లు అంగీకరించలేదు. వైట్ హౌస్ కూడా ఈ ప్యాకేజీని పార్లమెంట్ ద్వారా తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు.

పార్లమెంటు నిర్ణయాన్ని పక్కనపెట్టి ట్రంప్ ఈ ఉత్తర్వుపై సంతకం చేశారు. అటువంటి పరిస్థితిలో ఈ ఉత్తర్వును కోర్టులో సవాలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు కేవలం పార్లమెంటుకే ఉన్నది.


logo