నిరుద్యోగులకు ట్రంప్ షాక్

కరోనా భృతి బిల్లుపై సంతకం చేయని అమెరికా అధ్యక్షుడు
అయోమయంలో లక్షలాది నిరుద్యోగులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో దేశంలోని లక్షలాది మంది నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. కరోనా తెచ్చిన కష్టకాలంలో ఆర్థిక సహాయం అందజేసేందుకు ఉద్దేశించిన బిల్లుపై సంతకం చేయడానికి ట్రంప్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇల్లు గడిపేందుకు అవస్థలు పడుతున్న నిరుద్యోగులు... సకాలంలో సహాయం అందకపోతే రోడ్డున పడతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న నిరుద్యోగ భృతికి శనివారం అర్ధరాత్రితో గడువు ముగుస్తుంది. ఆలోగా కొత్త బిల్లుపై ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది. కానీ వారాంతాన్ని గడపడానికి ఫ్లోరిడా పామ్ బీచ్‌కి వెళ్లిన ట్రంప్... బిల్లుపై సంతకం చేయకపోగా కొత్త వాదన లేవనెత్తడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఉభయ సభలు ఇప్పటికే ఆమోద ముద్ర వేశాయి. ట్రంప్ కూడా అంగీకరించారని రిబ్లికన్లకు హామీ ఇచ్చాయి. కానీ, చివరికొచ్చేసరికి ట్రంప్ మెలిక పెట్టారు. కరోనా సహాయం కింద 600 డాలర్ల చొప్పున కాదు.. 2000 డాలర్లు ఇవ్వాలంటూ కొత్త పాట అందుకున్నారు. దీంతో కథ మొదటికొస్తుందని, ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆశలు పెట్టుకొన్న నిరుద్యోగులు ఇబ్బందులు పడతారని డెమోక్రాట్లు చెబుతున్నారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్... ట్రంప్‌కు ఫోన్ చేసి బిల్లుపై వెంటనే సంతకం చేయాలని కోరారు.
తాజావార్తలు
- వేలానికి నేతాజీ ఫండ్ రసీదు..
- ఫోన్.. ప్రాణం తీసింది
- భద్రత, రక్షణపై మహిళల్లో చైతన్యం
- శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
- మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు