శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 11:08:43

ఓ ముఖ్య‌మైన వ్య‌క్తిని క్ష‌మిస్తా: ట‌్రంప్‌

ఓ ముఖ్య‌మైన వ్య‌క్తిని క్ష‌మిస్తా: ట‌్రంప్‌

హైద‌రాబాద్‌: ఓ అతి ముఖ్య‌మైన వ్య‌క్తిని క్ష‌మించ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఆ జాబితాలో వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ కానీ, మాజీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు మైఖేల్ ఫ్లిన్ కానీ లేర‌న్నారు.  ఎయిర్ ఫోర్స్ వ‌న్‌లో రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఎవ‌ర్ని క్ష‌మిస్తున్నార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించేందుకు మాత్రం ట్రంప్ నిరాక‌రించారు. వాస్త‌వానికి స్నోడెన్‌ను క్ష‌మించ‌నున్న‌ట్లు శ‌నివారం ట్రంప్ తెలిపారు. 2013లో ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ అమెరికా ఎన్ఎస్ఏకు చెందిన ర‌హ‌స్య ప‌త్రాల‌ను ప‌లు వార్తా సంస్థ‌ల‌కు లీక్ చేశారు. ర‌ష్యా అంబాసిడ‌ర్‌తో మాట్లాడిన ఫ్లిన్‌.. ఇప్ప‌టికే రెండు సార్లు త‌న త‌ప్పును అంగీక‌రించాడు. అయితే ట్రంప్ ఎవ‌రికి క్ష‌మాభిక్ష పెడుతారో ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.logo