సోమవారం 01 జూన్ 2020
International - Apr 28, 2020 , 02:22:59

అమెరికా చరిత్రలో నా అంతటోడు లేడు!

అమెరికా చరిత్రలో నా అంతటోడు లేడు!

వాషింగ్టన్‌: అధ్యక్షుడిగా తాను కష్టపడినంతగా అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడూ కష్టపడలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. తొలి మూడున్నరేండ్ల్ల పదవీకాలంలో దేశం కోసం తాను చేసినంత పని మరెవ్వరూ చేసి ఉండరని అభిప్రాయపడ్డారు. తన గురించి, అమెరికా చరిత్ర గురించి తెలిసిన వారెవరైనా ఇదే చెబుతారన్నారు. ట్రంప్‌ పనితీరును విమర్శిస్తూ ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్‌ టైవ్‌ ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై మండిపడ్డ ఆయన పైవిధంగా స్పందించారు. వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, సైనిక వ్యవస్థ పునర్నిర్మాణం వంటి కీలక పనుల కోసం శ్వేతసౌధంలో రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని ట్రంప్‌ తెలిపారు. 


logo