గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 18, 2020 , 20:18:09

మాస్కులు ధ‌రించాల‌ని ఆదేశించ‌లేను: ట‌్రంప్‌

మాస్కులు ధ‌రించాల‌ని ఆదేశించ‌లేను: ట‌్రంప్‌

న్యూఢిల్లీ: నిత్యం వివాదాస్ప‌ద‌మైన‌, విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలంటే ముఖానికి మాస్కు ధ‌రించ‌డంతోపాటు సామాజిక దూరం త‌ప్ప‌నిస‌రి అని అన్ని దేశాల అధినేత‌లు చెబుతుంటే.. ట్రంప్ మాత్రం మాస్కు ధ‌రించాలంటూ అమెరికా ప్ర‌జ‌ల‌ను ఆదేశించ‌లేన‌ని చెప్పారు. మాస్కు ధ‌రించే విష‌యాన్ని ప్రజల ఇష్టానికే వదిలేయాలని తాను కోరుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు. 

తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలనే నిబంధనను తాను వ్యతిరేకిస్తాన‌న్నారు. మాస్క్‌లు వేసుకున్నంత మాత్రాన వైరస్‌ను పూర్తిగా నియంత్రించలేమని అభిపప్రాయపడ్డారు. నిపుణులు చెబుతున్నట్లుగా అవసరమైనప్పుడు మాస్క్ ధరించడం పెద్ద ఇబ్బందికాదని, కానీ సామాజిక దూరం పాటించడం కొంత ఇబ్బందేనని ట్రంప్ చెప్పారు. అయితే, జ‌న స‌మ్మ‌ర్థంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించాల‌ని ట్రంప్ సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo