బుధవారం 03 జూన్ 2020
International - May 15, 2020 , 15:08:35

చైనా అధ్య‌క్షుడితో మాట్లాడాల‌ని లేదు : ట‌్రంప్‌

చైనా అధ్య‌క్షుడితో మాట్లాడాల‌ని లేదు : ట‌్రంప్‌


హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చైనాపై అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అధ్య‌క్షుడు ట్రంప్ త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడేందుకు త‌న‌కు ఇష్టం లేద‌ని ట్రంప్ అన్నారు. అంతేకాదు, రెండ‌వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ అయిన చైనాతో సంబంధాలు కూడా క‌ట్ చేసేందుకు ట్రంప్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఫాక్స్ బిజినెస్ నెట్వ‌ర్క్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ అభిప్రాయాన్ని తెలిపారు. క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో చైనా విఫ‌ల‌మైంద‌ని, అందుకే ఇప్పుడు జిన్‌పింగ్‌తో మాట్లాడ‌లేన‌ని ట్రంప్ అన్నారు.  


logo