గురువారం 04 జూన్ 2020
International - Apr 30, 2020 , 14:25:30

న‌న్ను ఓడించేందుకు చైనా ఏమైనా చేస్తుంది..

న‌న్ను ఓడించేందుకు చైనా ఏమైనా చేస్తుంది..


హైద‌రాబాద్‌: రాబోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు చైనా ఏదైనా చేస్తుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అన్నారు. వైట్‌హౌజ్‌లో రైట‌ర్స్ సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  క‌రోనా వైర‌స్ గురించే ప్ర‌పంచ దేశాల‌ను ముందే చైనా అప్ర‌మ‌త్తం చేసి ఉండాల్సింద‌న్నారు.  అమెరికాలో చావులను ట్రంప్ నిలువ‌రించ‌లేక‌పోయార‌ని చైనా ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  న‌వంబ‌ర్‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ట్రంప్ మ‌ళ్లీ పోటీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్యర్థి జోసెఫ్ బైడెన్ గెల‌వాల‌న్న దీక్ష‌తో చైనా ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  బైడెన్ గెలుస్తార్న డేటాను కూడా ఆయ‌న‌ వ్య‌తిరేకించారు. ఈ దేశ ప్రజ‌లు స్మార్ట్ అని నేను న‌మ్ముతాను, ఓ అస‌మ‌ర్థునికి ప‌ట్టం క‌ట్ట‌ర‌ని అనుకుంటున్న‌ట్లు ట్రంప్ అన్నారు.  కావాల‌నుకుంటే చైనాను ఏమైనా చేయ‌గ‌ల‌న‌న్న ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగిన ట్రంప్.. ఇప్పుడు వైర‌స్ స‌మ‌యంలో డ్రాగ‌న్ దేశంతో ఎలా మైత్రిని కొన‌సాగిస్తారో వేచి చూడాల్సిందే.  


logo