శనివారం 06 జూన్ 2020
International - May 21, 2020 , 10:06:44

బైడెన్‌ను గెలిపిచేందుకే చైనా దుష్ప్ర‌చారం..

బైడెన్‌ను గెలిపిచేందుకే చైనా దుష్ప్ర‌చారం..

హైద‌రాబాద్‌: చైనాపై మ‌ళ్లీ ట్రంప్ మండ్డిప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వంపై చైనా దుష్ప్ర‌చారం చేస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ఆరోపించారు. ఈ ఏడాది జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో.. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌ను గెలిపించేందుకు చైనా స‌హ‌క‌రిస్తున్న‌ట్లు ట్రంప్ విమ‌ర్శ‌లు చేశారు. అందుకే ఆ దేశం త‌మ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు. వైర‌స్ ప‌ట్ల చైనా ప్ర‌తినిధి మాట్లాడిన అంశాల‌ను కూడా ట్రంప్ కొట్టిపారేశారు.  చైనా వ‌ల్లే ప్ర‌పంచం అంతా ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌న్నారు.  తాజాగా వైట్‌హౌజ్ చైనా ఆగ‌డాల‌ను ఖండిస్తూ ఓ రిపోర్ట్‌ను కూడా విడుద‌ల చేసింది. చైనా అనుస‌రిస్తున్న ఆర్థిక విధానాలు, సైనిక చ‌ర్య‌లు, మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు, దుష్‌ప్ర‌చారాల‌ను వైట్‌హౌజ్ త‌ప్పుప‌ట్టింది.logo