బుధవారం 03 జూన్ 2020
International - Apr 18, 2020 , 11:51:25

చైనా మృతులు ఇంకా చాలాచాలా ఎక్కువే ఉంటారన్న ట్రంప్

చైనా మృతులు ఇంకా చాలాచాలా ఎక్కువే ఉంటారన్న ట్రంప్

హైదరాబాద్: చైనా తాజాగా సవరించిన కరోనా మృతుల లెక్కలు కూడా సరైనవి కావని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అక్కడి మృతులు ఇంకా చాలాచాలా ఎక్కువ మందే ఉంటారని, అమెరికా ప్రస్తుత మృతుల కన్నా పెద్ద సంఖ్యే ఉంటుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వూహాన్‌లో అదృశ్య శత్రువు వల్ల కలిగిన మరణాల సంఖ్యను చైనా  రెట్టింపు చేసింది.. అయినా అది అసలు సంఖ్యకు దరిదాపులో లేదని ట్రంప్ అన్నారు. చైనా నిజానికి రెట్టింపు చేయలేదు. కేవలం 50 శాతం ఎక్కువగా చూపింది. చైనా తన లెక్కలను సవరించడం విశ్వసనీయత సమస్యగా కొందరు చూపుతున్నారు. కానీ చిన్నా చితకా ఆస్పత్రుల్లో, ఇంటివద్ద చికిత్స పొందడం లేదా బాధితుల పూర్తి వివరాలు మొదట అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల సంఖ్యను సవరించినట్టు చైనా చెప్తున్నది. ఇంతకూ తాను అనుకుంటున్న  అసలు సంఖ్య ఏమిటో ట్రంప్ చెప్పనేలేదు.


logo