బుధవారం 03 జూన్ 2020
International - Apr 04, 2020 , 16:41:12

మాస్క్ పెట్టుకోను: డోనాల్డ్‌ ట‌్రంప్‌

మాస్క్ పెట్టుకోను:  డోనాల్డ్‌ ట‌్రంప్‌


హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన సీడీసీ సంస్థ‌.. దేశ ప్ర‌జ‌లు మాస్క్‌లు పెట్టుకోవాల‌ని సూచించింది. కానీ ఆ దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ సూచ‌న‌ను స్వీక‌రించ‌డం లేదు.  ముఖానికి మాస్క్‌ను పెట్టుకోను అని ట్రంప్ స్ప‌ష్టం చేశారు.  నోవెల్ క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌జ‌లంతా మాస్క్‌లు ధ‌రించాల‌ని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ శాఖ ఆరోగ్య సూచ‌న‌లు చేసింది. కానీ ఆ నియ‌మావ‌ళిని ఫాలోకాలేన‌ని ట్రంప్ అన్నారు. ఓవెల్ ఆఫీసు నుంచి దేశాధ్య‌క్షుల‌ను, ప్ర‌ధానుల‌ను, రాజుల‌ను, రాణుల‌ను .. ముఖానికి మాస్క్ పెట్టుకుని గ్రీటింగ్ చేయ‌లేను అని అన్నారు. అయితే సీడీసీ రిలీజ్ చేసి గైడ్‌లైన్స్‌ను ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా స్వీక‌రించ‌వ‌చ్చు అన్నారు. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 270473 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. 7వేల మంది మ‌ర‌ణించారు. అమెరిక‌న్లు, యురోపియ‌న్లు మాస్క్‌లు ధ‌రిస్తే.. మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుతుంద‌ని చైనా కూడా అభిప్రాయ‌ప‌డింది.
logo