శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 19:34:58

సెప్టెంబర్ తర్వాతనే జీ 7 సమావేశాలు

సెప్టెంబర్ తర్వాతనే జీ 7 సమావేశాలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు సెప్టెంబర్‌లో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. నవంబర్ మూడో తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 

నిజానికి ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని క్యాంప్ డేవిడ్‌లో జీ 7 సమ్మిట్ జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా కారణంగా సభ్య దేశాల నాయకులు వ్యక్తిగతంగా రావడం సాధ్యం కాలేదు. అనంతరం జూన్ నెలలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పిలవాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు వస్తుండటంతో సెప్టెంబర్‌ తర్వాతనే జరుపుతామని ట్రంప్ తెలిపారు.

జీ-7 లో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ ఉన్నాయి. అన్ని సభ్య దేశాలు వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తాయి. ఈ సంవత్సరం యూఎస్ లో జరుగబోతోంది.

ఇంతవరకు ఎవర్నీ ఆహ్వానించలేదు: ట్రంప్

జీ-7 సమావేశాలకు రావాల్సిందిగా ఎవరికీ వైట్ హౌస్ ఇంకా అధికారికంగా ఆహ్వానం పంపలేదని ట్రంప్ చెప్పారు. ఈసారి జీ-7 లో అధికారిక సభ్యులు కాని దేశాలను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.


logo