శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 15, 2020 , 16:08:39

క‌రోనా బెనిఫిట్ చెక్కుల‌పై ట్రంప్ సంత‌కం..

క‌రోనా బెనిఫిట్ చెక్కుల‌పై ట్రంప్ సంత‌కం..


హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌తో అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ స్తంభించిన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఆ దేశ ప్ర‌భుత్వం సుమారు 2 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించింది.  నిరుద్యోగ యువ‌త‌ను, అనాథ‌ల‌ను, ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకునేందుకు ఆ ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించారు. ఆ ప్యాకేజీలో భాగంగా చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కుటుంబాల‌కు 1200 డాల‌ర్లు ఇవ్వ‌నున్నారు. అయితే ప్ర‌భుత్వ రెవ‌న్యూశాఖ జారీ చేసే ఆ చెక్కుల‌పై అధ్య‌క్షుడు ట్రంప్ సంత‌కం ఉండ‌నున్న‌ది.  సాధార‌ణంగా ప్ర‌భుత్వ చెక్కుల‌పై స్థానిక ఆఫీస‌ర్ సంత‌కం ఉంటుంది. కానీ ఉద్దీప‌న్ అమౌంట్‌కు సంబంధించిన చెక్కుల‌పై ట్రంప్ సంత‌కం ఉన్న‌ట్లు అమెరికా మీడియా పేర్కొన్న‌ది. ఇప్ప‌టికే రెవ‌న్యూశాఖ కొన్ని ల‌క్ష‌ల చెక్కుల‌ను మెయిల్ చేసింది. ప్ర‌తి ఒక్క చెక్కుపైన ట్రంప్ సంత‌కం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెవ‌న్యూశాఖ జారీ చేసిన చెక్కుల‌పై తొలిసారి దేశాధ్య‌క్షుడి సంత‌కం ఉండ‌నున్న‌ట్లు వాషింగ్ట‌న్ పోస్టు త‌న క‌థ‌నంలో చెప్పింది. ట్రంప్ సంత‌కం ఉన్నా.. చెక్కుల పంపిణీలో ఎటువంటి జాప్యం ఉండ‌ద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.logo