గురువారం 04 జూన్ 2020
International - May 15, 2020 , 02:24:25

స్కూళ్లు తెరుద్దాం.. అప్పుడే వద్దు!

స్కూళ్లు తెరుద్దాం.. అప్పుడే వద్దు!

ట్రంప్‌, ఫౌసీ తలోదారి

వాషింగ్టన్‌: కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తెరిచే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, శ్వేతసౌధంలోని కరోనా టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న ఆంటోని ఫౌసీకి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల్ని తెరువాలని ట్రంప్‌ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న ఇలాంటి సమయంలో స్కూళ్లను తెరువడం అంత శ్రేయస్కరం కాదని ఫౌసీ అభిప్రాయపడుతున్నారు. 


logo