మంగళవారం 19 జనవరి 2021
International - Nov 26, 2020 , 09:57:57

మాజీ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడిని క్ష‌మించిన ట్రంప్‌

మాజీ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడిని క్ష‌మించిన ట్రంప్‌

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న వ‌ద్ద విధులు నిర్వ‌ర్తించిన మాజీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు మైఖేల్ ఫ్లిన్‌ను క్ష‌మించారు.  ర‌ష్యాతో ట్రంప్‌కు సంబంధాలు ఉన్న‌ట్లు గ‌తంలో ఎఫ్‌బీఐ ముందు ఫ్లిన్ ఆరోపించారు. అయితే ఆ కేసులో త‌న త‌ప్పును అంగీక‌రిస్తున్న‌ట్లు ఫ్లిన్ ఒప్పుకున్నారు.  దీంతో ఫ్లిన్‌ను క్ష‌మిస్తున్న‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు.  గౌర‌వ‌పూర్వ‌కంగానే క్ష‌మాభిక్ష‌ను క‌ల్పిస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకున్న‌ట్లు న్యాయ‌శాఖ ముందు ఫ్లిన్ పేర్కొన్నారు.  అయితే 2017లో ఎఫ్‌బీఐకి అబ‌ద్దాలు చెప్పిన‌ట్లు ఫ్లిన్ అంగీక‌రించారు. ఒబామా ప్ర‌భుత్వం వేసిన ఉచ్చులో ఫ్లిన్ చిక్కుకున్న‌ట్లు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు భావిస్తున్నారు.  2016లో జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకోలేద‌ని 2019లో అమెరికా న్యాయ‌శాఖ విచార‌ణ నివేదిక‌ను స‌మ‌ర్పించింది.